WGL: దుగ్గొండి మండల తాహసీల్దార్‌గా ముసిక సమ్మక్క బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శక సేవలు అందించడమే తన లక్ష్యమని తెలిపారు. సాదా బైనామా ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న రెవిన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
VZM: అనుమానంతో భార్యను హత్య చేసిన కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు విధించింది. పెదమానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న సత్యనారాయణ, భార్యపై అనుమానంతో పామ్ ఆయిల్ తోట వద్ద హత్య చేశాడు. దీంతో పోలీసులు నింధితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి పద్మావతి జీవిత ఖైదు, రూ.3,000 జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు.
KMM: తిరుమలాయపాలెం మండల పరిధిలోని బచ్చోడు గ్రామం బుధవారం ఆధ్యాత్మిక చైతన్యంతో పులకించిపోయింది. గత మూడు రోజులుగా అత్యంత నిష్ఠతో నిర్వహిస్తున్న శ్రీ సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణ, ఆంజనేయ స్వామివార్ల సహిత శ్రీరామ లింగేశ్వర, కనకదుర్గమ్మ ఆలయ శిఖర కలశ ప్రతిష్ఠాపన మహోత్సవాలు బుధవారం నాటి ప్రధాన ఘట్టంతో వైభవంగా ముగిశాయి.
ప్రకాశం: కొమరోలు మండలంలో పెట్రోల్ బంకుల్లో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహిచారు. మండల పరిధిలోని యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమై పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుని స్టాక్ పరిశీలించారు. అనవసరంగా కృత్రిమ కొరతను సృష్టించేందుకు యత్నిస్తే చర్యలు తప్పవని యాజమాన్యాలకు వార్నింగ్ ఇచ్చారు.
ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్నస్వామి స్టేడియంలో ఇకపై ఎటువంటి ఫిజికల్ టిక్కెట్లను అనుమతించబోమని తెలిపారు. కేవలం డిజిటల్ QR కోడ్ టిక్కెట్లను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. టిక్కెట్ల అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, తొక్కిసలాట వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికే ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
SRPT: ఈ నెల 29న జరిగే మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహాధర్నా జయప్రదం చేయాలని రాష్ట్ర జేఏసీ నాయకుడు శంకర్ పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట మున్సిపాలిటీలో ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది అంతా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు చీకూరి అశోక్ కుమార్, సెక్రటరీ వేణు, ఉద్యోగులు పాల్గొన్నారు.
KMR: రామారెడ్డి మండలం గోకుల్ తండా ప్రభుత్వ పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో సీట్లు సాధించినట్లు పాఠశాల హెచ్ఎం ఖదీర్ తెలిపారు. ఇటీవల పాఠశాలకు చెందిన పదిమంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయగా తొమ్మిది మంది విద్యార్థులు ఎంపికైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు.
VSP: ఎర్త్ అవర్ 2026 సందర్భంగా మార్చి 28 శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకు అవసరం లేని విద్యుత్ దీపాలను ఆఫ్ చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ నగర ప్రజలను కోరారు. World Wide Fund for Nature ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల్లో నిర్వహించబడుతోందన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలన్నారు.
WNP: చీర్కపల్లి గ్రామ సర్పంచ్ పగడాల రవి నేతృత్వంలో ఉపసర్పంచ్ పరుశురాములు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జమ్మి మల్లేష్, వార్డ్ సభ్యులు దొడ్ల కాశీమ్లు వనపర్తి జిల్లా కలెక్టర్ను కలిశారు. గ్రామ అభివృద్ధికి సంబంధించి విస్తృతంగా చర్చించారు. గ్రామంలో జరుగుతున్న పనులు, భవిష్యత్ ప్రణాళికల గురించి కలెక్టర్కు వివరించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ మాట్లాడుతూ.. పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా బందు క్రాంతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై పోరాటాలకు నూతన కమిటీ నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
SRCL: గర్భస్థ నిర్ధారణ పూర్తిగా నిషేధమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలో స్కానింగ్ సెంటర్ల యజమానులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎవరైనా గర్భస్థ పిండ నిర్ధారణ చేస్తే రూ 10 వేల జరిమానాతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారన్నారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు పాటించాలన్నారు.
MNCL: జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
SRPT: వాహనదారులు అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలని, నిబంధనల ప్రకారం వాహనాలు నడపాలని ఎస్సై క్రాంతికుమార్ అన్నారు. బుధవారం తుంగతుర్తిలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలని, రోడ్డు నియమ నిబంధనలను పాటించాలన్నారు.
KRNL: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ ట్రైనింగ్ కార్యక్రమంలో క్లస్టర్ కన్వీనర్ గణేకల్లు విరూపాక్షి ఇవాళ పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ సహా నేతలు శిక్షణ ఇచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికలు, 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని సూచించినట్లు ఆయన తెలిపారు.
MHBD:ఎస్సీ యాక్షన్ ప్లాన్ ద్వారా స్వయం ఉపాధి పొందే ఎస్సీ యువత కొరకు దరఖాస్తుల గడువు ఏప్రిల్ 2 వరకు పొడిగించినట్లు కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసరావు తెలిపారు.జిల్లాల్లో 70 నుంచి 90% సబ్సిడిపై EV టూవీలర్లు, ఆటోలు,సోలార్ పంపుసెట్లను ప్రభుత్వం అందిస్తోందన్నారు. అర్హుత గలవారు ఏప్రిల్ 2లోగా tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.