• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

IND vs NZ : ముగిసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్.. భారత్ కు 177 పరుగుల లక్ష్యం

IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పూర్తయింది. పరిమిత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 176 పరుగులు చేసి భారత్ కు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో మిచెల్, కాన్వే రాణించారు. మిచెల్ నాట్ అవుట్ గా నిలిచి 30 బంతుల్లో 59 పరుగులు చేశాడు. కాన్వే 35 బంతుల్లో 52 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఫిన్ […]

January 27, 2023 / 08:58 PM IST

కారు బీభత్సం.. స్కూటీని ఢీకొట్టి అంతటితో ఆగకుండా.. వీడియో

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ కారు నడి రోడ్డు మీద బీభత్సం సృష్టించింది. రోడ్డు మీద వెళ్తున్న స్కూటీని అతి వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు అంతటితో ఆగకుండా అలాగే వెళ్లింది. అయితే.. స్కూటీని బలంగా కారు ఢీకొనడంతో స్కూటీ మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కారు మీదికి ఎగిరి పడ్డారు. అయినా కూడా డ్రైవర్ కారును ఆపకుండా అలాగే చాలా దూరం కారును తీసుకెళ్లాడు. ఆ తర్వాత కారును ఆపాడు. [&hel...

January 27, 2023 / 08:47 PM IST

సికింద్రాబాద్ మారేడుపల్లిలో అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్ లోని మారేడుపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మారేడుపల్లిలో ఉన్న శ్రీలా హిల్స్ అనే అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు చుట్టుపక్కన ఉండే ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. వెంటనే రంగంలోకి దిగిన ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా? ప్రమాదం ఎలా జరిగింది.. అనే విషయాలు తెలియాల్సి ఉంది.

January 27, 2023 / 08:24 PM IST

పాదయాత్ర ముగియగానే నేరుగా తారకరత్న దగ్గరికి వెళ్లిన నారా లోకేశ్

యువగళం పేరుతో టీడీపీ యువనేత నారా లోకేశ్ ఈరోజు నుంచి ఏపీలో పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇవాళ ప్రారంభమైన పాదయాత్రలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర ప్రారంభం అయిన తర్వాత లోకేశ్ తో పాటు పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ...

January 27, 2023 / 08:16 PM IST

మూడు పెళ్లిళ్లపై బాలయ్య ప్రశ్న.. ఇరకాటంలో పవన్ కల్యాణ్

టాక్ షోలలోనే నంబర్ వన్ గా నిలుస్తున్న అన్ స్టాపబుల్-2 షోకు సంబంధించిన మరో ప్రొమో విడుదలైంది. షో హోస్ట్ నందమూరి బాలకృష్ణ తన ప్రశ్నలతో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను ఇరకాటంలోకి నెట్టేశాడు. ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు, సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న సవాళ్లపై బాలయ్య ప్రశ్నలు అడగడంతో పవన్ కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అయినా కూడా పవన్ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. ఈ మధ్యలో రామ్ చరణ్, సాయిధ...

January 27, 2023 / 07:37 PM IST

మహాప్రస్థానంలో ముగిసిన జమున అంత్యక్రియలు.. చితికి నిప్పంటించిన కూతురు

తెలుగు సీనియర్ నటి జమున అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో సాయంత్రం ముగిశాయి. జమునకు తన కూతురు అంత్యక్రియలు నిర్వహించింది. జమున చివరి చూపు చూసేందుకు అభిమానులు భారీగా మహా ప్రస్థానానికి తరలివచ్చారు. జమున కొడుకు అమెరికా నుంచి రావడానికి ఇంకా సమయం పడుతుండటంతో ఆమె కూతురు స్రవంతి రావు జమున చితికి నిప్పంటించారు. జమున పార్థీవ దేహం మహా ప్రస్థానానికి చేరుకున్నాక.. మా అసోసియేషన్ సభ్యులు జీవితతో ...

January 27, 2023 / 07:35 PM IST

మోదీ డాక్యుమెంటరీపై యూనివర్సిటీలలో రచ్చ.. 144 సెక్షన్.. విద్యార్థుల అరెస్ట్

కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని మోదీ మీద బీబీసీ చానెల్ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా యూనివర్సిటీ అధికారులు అడ్డుకుంటున్నారని విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో తాజాగా టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఎన్ఎస్ యూఐకి చెందిన విద్యార్థులు యూనివర్సిటీలో డాక్యుమెంటరీని ప్రదర్శ...

January 27, 2023 / 07:24 PM IST

IND vs NZ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సమరం ప్రారంభమయింది. టీ20 సిరీస్ లో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ ఇంకాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా నుంచి శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, త్రిపాఠి, సూర్య కుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా(కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా, కుల్ దీప్ యాదవ్, శివమ్ [&...

January 27, 2023 / 06:56 PM IST

నా ప్రభుత్వాన్నే విమర్శిస్తావా.. మైక్ లాక్కున్న ముఖ్యమంత్రి

ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అధికార పార్టీ వాళ్లు తట్టుకోలేరు. ఎక్కడైనా బహిరంగంగా విమర్శలు చేస్తే ఇక భౌతిక దాడులే. అలాంటిది పక్కన ఉండగానే తన ప్రభుత్వాన్ని విమర్శిస్తే ముఖ్యమంత్రి ఊరుకుంటారా? లేదు కదా. కర్ణాటకలో అలాంటి సంఘటనే జరిగింది. ఓ స్వామిజీ బెంగళూరులో వరదల గురించి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అడ్డుకున్నారు. స్వామిజీ చేతుల్లో మైక్ లాక్కున్నారు. వివరణ ఇచ్చేందుకు ప్ర...

January 27, 2023 / 06:47 PM IST

చాకొలేట్లతో పెళ్లికూతురు జడ అలంకరణ.. పెళ్లి కొడుకు షాక్.. వీడియో

Viral Video : జీవితంలో పెళ్లి ఒకసారే జరుగుతుంది. అందుకే చాలామంది తమ పెళ్లిని జీవితాంతం గుర్తుండేలా ప్లాన్ చేసుకుంటారు. పెళ్లి రోజు అందరికీ గుర్తుండేలా వెరైటీగా, వింతగా, ఏదో కొత్తగా చేస్తుంటారు. ఈ మధ్య పెళ్లిళ్లలో పెళ్లికొడుకు, పెళ్లికూతురు డ్యాన్స్ చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు అదే ట్రెండ్ కొనసాగుతోంది. కానీ.. ఈ పెళ్లికూతురు మాత్రం పెళ్లికొడుకుకు షాక్ ఇద్దామనుకుందో ఏమో కానీ.. పెళ్లికూతురు జడ మొత్త...

January 27, 2023 / 06:45 PM IST

విష వ్యర్థాలతో నిండిపోయిన ఇంద్రాయని నది.. బెంబేలెత్తుతున్న పూణె వాసులు.. వీడియో

సాధారణంగా నగరాల్లో ఉండే చెరువులు కానీ.. ఇతర కుంటలు, నదులు గట్రా డ్రైనేజ్ నీళ్లు, ఇతర వ్యర్థాలతో నిండిపోతాయి. చివరకు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు కూడా అందులోనే కలుస్తుంటాయి. అందుకే.. నగరాల నుంచి ప్రవహిస్తూ వెళ్లే ఏ నీటిని కూడా జనాలు తాగరు. ఖచ్చితంగా అవి నగరాల్లో కలుషితం అవుతాయి. అలా చాలా నగరాల్లో ప్రవహించే నదులు, చెరువులు కలుషితం అయ్యాయి. అయితే.. మహారాష్ట్రలోని పూణె జిల్లా నుంచి ప్రవహిస్తూ వెళ...

January 27, 2023 / 05:46 PM IST

యూఎస్ లో కాల్పులు.. తీవ్రంగా గాయపడిన హైదరాబాద్ యువకుడు.. ట్రీట్ మెంట్ కు రూ.18 లక్షలు.. సాయం కోసం అభ్యర్థన

యూఎస్ లోని చికాగోలో హైదరాబాద్ కు చెందిన సాయి చరణ్ కొప్పాల ఇటీవల జరిగిన గన్ ఫైరింగ్ లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ట్రీట్ మెంట్ జరుగుతోంది. సాయి కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉంటారు. అక్కడికి వెళ్లడానికి, అక్కడ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ కు భారీగా ఖర్చు అవుతుందని అతడి తల్లిదండ్రులు వాపోతున్నారు. యూఎస్ లో ఆసుపత్రిలో చికిత్స కోసం ఇప్పటికే లక్షలు ఖర్చు చేశారు. ఇంకా రూ.18 లక్షల...

January 27, 2023 / 05:21 PM IST

ఘనంగా రాకింగ్ రాకేశ్ నిశ్చితార్థం.. మంత్రి రోజా సందడి

జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వారిద్దరూ చాలా షోలలో కలిసి సందడి చేస్తున్నారు. తమ ప్రేమ బంధానికి వారి కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో ఇక వారిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాకేశ్, సుజాతల నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా హాజరై...

January 27, 2023 / 05:14 PM IST

జియో వాడుతున్నరా.. ఆ రీచార్జ్ తో 23 రోజులు అన్ లిమిటెడ్ కాల్స్, ఫ్రీ డేటా

Jio Annual Plan : జియో నెట్ వర్క్ వాడేవాళ్లకు గుడ్ న్యూస్. జియో కొత్త సంవత్సరం సందర్భంగా ఇటీవల తీసుకొచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్స్ లో వార్షిక ప్లాన్ ను కూడా ప్రవేశపెట్టింది. రూ.2999 పెట్టి జియో రీచార్జ్ చేయిస్తే సంవత్సరం పాటు జియో సేవలను వినియోగించుకోవచ్చు. 365 రోజుల పాటు ప్యాక్ వాలిడిటీ ఉంటుంది. రోజూ 2.5 జీబీ డేటా లభిస్తుంది. అలాగే.. అన్ లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్ […]

January 27, 2023 / 05:02 PM IST

నిన్న ఉద్యోగులను తీసేసి.. ఇప్పుడు ఆఫీసు బిల్డింగ్ లనూ అమ్మేస్తున్న టెక్ కంపెనీ

ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ మాట తప్పించి వేరే వినిపించడం లేదు. చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ తో పాటు అతి పెద్ద ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా వేల మందిని ఒకేసారి తొలగించింది. దాదాపు 18 వేల మంది ఉద్యోగులను ఈ కంపెనీ తొలగించింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక మాంద్యం పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అమెజాన్ కాస్ట్ కటింగ్ లో భాగంగా...

January 27, 2023 / 04:24 PM IST