మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Vivekananda Reddy) హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది.వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి(Rajasekhar Reddy)ని సీబీఐ నేడు విచారించింది. సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చిన సీబీఐ (CBI).. హైదరాబాద్ లోని ఆఫీస్ కు విచారణకు రావాలని కోరింది. దీంతో శనివారం ఆయన విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖపై రాజశేఖర్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. లేఖను ఎందుకు దాచిపెట్టమని చెప్పాల్సి వచ్చిందని వివరణ అడిగారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడంలేదని ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) ప్రశ్నిస్తున్న తరుణంలో… రాజశేఖర్ రెడ్డిని సీబీఐ విచారించడం ప్రాధాన్యత సంచరించుకుంది. వివేకా హత్య కేసులో ఇటీవల అరెస్టైన వైఎస్ భాస్కర్‌రెడ్డి(YS Bhaskar Reddy), ఉదయ్‌కుమార్‌రెడ్డిలతో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ విచారిస్తుంది. కాగా, సీబీఐ విచారణ కొద్దిసేపటి కిందటే ముగియడంతో, రాజశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయారు.