ఓ యువకుడు జాతీయ జెండా(National Flag)తో చికెన్(Chicken) శుభ్రం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. జాతీయ జెండాను అగౌరవపరిచిన ఈ వ్యవహారం పోలీసులకు తెలిసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దాద్రా నాగర్ హవేలీలోని సిల్వస్సాకు చెందిన యువకుడు మహమ్మద్ సైఫ్ ఖురేషీ చికెన్ షాపు(Chicken)లో పనిచేస్తుంటాడు. షాపులో పనిచేస్తున్న సమయంలో ఆ వ్యక్తి జాతీయ జెండా(National Flag)తో చికెన్‌ను శుభ్రపరిచాడు.
జాతీయ జెండాతో చికెన్ శుభ్రం చేస్తున్న వీడియో:
Video Player
Media error: Format(s) not supported or source(s) not found
సైఫ్ చేస్తున్న చర్యను అటుగా వెళ్తున్న వ్యక్తి సహించలేకపోయాడు. వెంటనే జాతీయ జెండా(National Flag)తో చికెన్ శుభ్రపరుస్తున్న సైఫ్ ను వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీడియో నెట్టింట వైరల్(Viral) అవ్వడంతో సైఫ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు సైఫ్ చర్యలకు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ జెండా(National Flag)ను అవమానించిన ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
పోలీసులు వీడియో ఆధారంగా సైఫ్ పై కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేశారు. సైఫ్ ను జుడీషియల్ కస్టడీకి పోలీసులు తరలించారు. మున్సిపాలిటీ అధికారులు కూడా చికెన్ షాప్ కి సీల్ వేసి చర్యలు తీసుకున్నాడు. ప్రస్తుతం సైఫ్ జాతీయ జెండా(National Flag)తో చికెన్ శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.