»Scary Intensity Of Sun Boiling Water In Water Tank Video Viral
Viral News: భయపెడుతున్న ఎండ తీవ్రత.. సలసల మరుగుతున్న వాటర్ ట్యాంక్‌లోని నీళ్లు.. వీడియో వైరల్
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. 50 డిగ్రీలను దాటడం అంటే మాములు విషయం కాదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.
Scary intensity of sun.. Boiling water in water tank.. Video viral
Viral News: ఎండ తీవ్రత ప్రజలను భయపెడుతుంది. కాసేపు అలా రోడ్డుమీదకు వెళ్తే మాడు పలిగే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని, దేశవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దేశ రాజధానిలో సూరీడి ప్రతాపానికి జనం తల్లడిల్లిపోయారు. సాయంత్రమైనా సరే కాలు బయటపెట్టాలంటే ప్రజలు భయపడుతున్నారు. రెండ్రోజుల క్రితం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీనికి సంబంధంచిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఓ భవనంపై ట్యాంకులో నీళ్లు సలసల మరుగుతున్నాయి. ఆ సమయంలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన ఓ యూజర్ ఇలా రాసుకొచ్చారు. ఢిల్లీలో ఇది పరిస్థితి. ఎలా నీళ్ళు మరిగిపోతున్నాయో చూడండి అంటూ పోస్టు చేశాడు. దీనిపై నెటిజనులు స్పందిస్తున్నారు. నీళ్ల పరిస్థితి ఇలా ఉంటే ప్రజలు ఎలా బతుకుతారు అని కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై కొన్ని భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. నీళ్లు బాయిల్ కావాలంటే 100 డిగ్రీలు ఉండాలి అని కానీ 52 డిగ్రీలకు ఇలా నీళ్లు మరగడం ఆసాధ్యం అని చెబుతున్నారు. ఇది ఫేక్ వీడియో అని మరికొందరు అంటున్నారు.