»Up Cop Perfomrs Cpr On Moneky Who Faints In Heat Wave
Heat Wave : సొమ్మసిల్లిన కోతికి కానిస్టేబుల్ సీపీఆర్, వీడియో వైరల్
సొమ్మసిల్లి పడిపోయిన కోతిపై ఓ కానిస్టేబుల్ మానవత్వం చూపించారు. దానికి సీపీఆర్ నిర్వహించి తిరిగి స్పృహలోకి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Heat Wave : ప్రస్తుతం ఉన్న ఎండలకు మనుషులే అల్లలాడిపోతున్నారు. ఇక మూగ జీవాల సంగతి ఏం చెప్పగలం. ఉత్తర ప్రదేశ్లో వడ దెబ్బ తగిలి ఓ కోతి సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో స్థానికంగా ఉన్న కానిస్టేబుల్ దానికి సీపీఆర్(Cpr) నిర్వహించారు. ఛాతిపై బలంగా నొక్కుతూ ఉండగా అది కాసేపటికి స్పృహలోకి వచ్చింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఉత్తర భారత దేశంలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. వడ దెబ్బ తగిలి అక్కడ ఇప్పటి వరకు 50 మందికి పైగా మృతి చెందారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే ఇక మూగ జీవాల పరిస్థితి సైతం అంతే దయనీయంగా మారింది. యూపీలోని(Up) బులందహర్లో ఎండ వేడి తట్టుకోలేక ఓ కోతి(Moneky) సొమ్మసిల్లి పడిపోయింది. అక్కడున్న కానిస్టేబుల్ వికాస్ దాని చూశారు. మనకెందుకులే అని వదిలేయకుండా దానికి సీపీఆర్(Cpr) నిర్వహించారు. గుండెలపై గట్టిగా ఒత్తుతూ దానిపై కాస్త చల్లటి నీటిని పోయసాగారు. దీంతో ఆ వానరం కాసేపటికి తేరుకుంది. కళ్లు తెరిచింది.
మూగ జీవాల పట్ల కూడా ప్రేమ చూపించే ఇలాంటి వారు ఉండటం ప్రశంసనీయం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆయన చేసిన మంచి పనిని అదే పనిగా కొనియాడుతున్నారు. దీంతో ఆ వీడియో నెట్లో ప్రస్తుతం వైరల్గా మారింది. మరింకెందుకాలస్యం దాన్ని మీరూ ఇక్కడ చూసేయండి.