కోలీవుడ్(Kollywood) స్టార్ హీరో విక్రమ్(Hero Vikram)కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకులందర్నీ ఆకట్టుకున్నాడు. సినిమా పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు. ఆ మధ్య శంకర్(Shankar) దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమా(I movie)లో విక్రమ్ చూపించిన వేరియేషన్స్‌కు అందరూ ఫిదా అయిపోయారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా విక్రమ్ ప్రయోగాలతో దూసుకుపోతున్నాడు.
తాజాగా విక్రమ్(Hero Vikram) తన జీవితంలో జరిగిన చేదు అనుభవం గురించి అభిమానులకు చెప్పాడు. తనకు 12 ఏళ్ల వయసులో ఫ్రెండ్స్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ యాక్సిడెంట్లో కుడికాలికి తీవ్రంగా గాయం అయ్యింది. చాలా చోట్ల ఎముకలు కూడా విరిగాయి. చాలా రోజులు ట్రీట్ మెంట్ తీసుకున్నాడట. డాక్టర్లు విక్రమ్(Hero Vikram) కాలును తీసేస్తే మంచిదని సలహా ఇచ్చారట. కానీ విక్రమ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదట.
ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా విక్రమ్(Hero Vikram) గాయం నుంచి కోలుకుని బయటపడినట్లు తెలిపాడు. దాదాపు 23 సర్జరీలు జరిగాక మూడేళ్ల పాటు వీల్ ఛైర్ లోనే విక్రమ్ ఉన్నాడట. ఆ చేదు అనుభవాన్ని తలచుకుని విక్రమ్ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన పొన్నియన్ సెల్వన్ 2(Ponniyan selvan 2) సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 28న విడుదల కానుంది.