టాలీవుడ్(Tollywood) హీరో సంతోష్ శోభన్(Hero Santhosh Shobhan) ‘అన్నీ మంచి శకునములే’ సినిమా(Anni Manchi Shakunamule Movie)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘గోల్కొండ హై స్కూల్’తో బాలనటుడిగా సంతోష్ శోభన్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘తాను నేను’ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత ‘పేపర్ బాయ్’ సినిమా(Paperboy Movie)తో వచ్చి పర్వాలేదనిపించాడు. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందాడు. చాలా వరకూ సినిమాలు సంతోష్ శోభన్(Hero Santhosh Shobhan)ను నిరాశ పరిచాయి.
తాజాగా అన్నీ మంచి శకునములే సినిమా(Anni Manchi Shakunamule Movie)తో వెండితెరపై కనిపించనున్నాడు. ఈ మూవీకి నందిని రెడ్డి (Nandini reddy) దర్శకత్వం వహిస్తోంది. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. రిలీజ్ నేపథ్యంలో ఈ మూవీ టీమ్ ప్రమోషన్స్ పెంచింది. వరుస అప్డేట్లను ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మెరిసే మబ్బుల్లో’ అనే మెలోడీ సాంగ్ (Melody Song)ను చిత్ర యూనిట్ విడుదల(Release) చేసింది.
‘అన్నీ మంచి శకునములే’ సినిమా(Anni Manchi Shakunamule Movie)కు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాటకు రెహమన్ సాహిత్యం అందించారు. నకుల్, రమ్య భట్ ఈ పాటను పాడారు. ఈ మూవీలో సంతోష్‌కు జోడీగా మాళవికా నాయర్(Malavika Nair) కనిపిస్తోంది. మే 12వ తేదిన ఈ మూవీ విడుదల(Release) కానుంది.