BHNG: మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామంలో సమస్యల పరిష్కారం కోసం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. సదర్ శాపురం-పాటిమట్ల మధ్య కూలిపోయిన కల్వర్టును నిర్మించాలని, బృందావనం కాలువలో పూడికతీత పనులు చేపట్టాలని కోరారు. అలాగే, తాగునీటి ట్యాంకులను శుభ్రం చేసి, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.