చిత్తూరు: జిల్లాలో డిసెంబరు 30న 7,500 మద్యం బాక్సులు, 2,500 బీరు బాక్సులు అమ్ముడై రూ. 5.05 కోట్ల ఆదాయం వచ్చింది. 31న 4,900 మద్యం, 2,400 బీరు బాక్సుల విక్రయాలతో రూ. 3.78 కోట్లు సమకూరాయి. బార్లలో రూ. 2 కోట్లకు పైగా అమ్మకాలు జరగడంతో రెండు రోజుల్లో మొత్తం ఆదాయం రూ.10.83 కోట్లకు చేరింది. జనవరి 1న కూడా రూ. 2 కోట్లకు పైగా విక్రయాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.