కృష్ణా: అమరవీరుడు మురళి నాయక్ దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోవడంపై బాపులపాడులో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మురళి నాయక్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ, దేశ భద్రతలో జవాన్ల త్యాగాలను కొనియాడారు. ప్రజలు వీర జవాన్లకు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.