kMM: ఉమ్మడి జిల్లా పరిధిలో డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఏ, బీకాం, బీఎస్సీ 2, 4, 6 సెమిస్టర్లు చదువుతున్న విద్యార్థులు సకాలంలో రుసుములు చెల్లించాలన్నారు. ఈనెల31లోగా పరీక్షల రుసుమును చెల్లించాలని ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ డా.మొహ్మద్ జాకిరుల్లా, ప్రాంతీయ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డా.బి.వీరన్న తెలిపారు.