NLR: కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రసన్నకుమార్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కావలి జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ సుధీర్ బుధవారం డిమాండ్ చేశారు. వ్యక్తిగత దూషణలు సరికాదని జనసేన నేతలు మండిపడ్డారు.