VSP: జీవీఎంసీ 32వ వార్డు అల్లీపురం ఏడుగుళ్ల గుడి సెంటర్ వద్ద కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం పర్యటించారు. వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పరిస్థితులపై సమీక్షించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని జీవీఎంసీ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కందుల నాగరాజు, అధికారులు పాల్గొన్నారు.