SRPT: తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా అనంతగిరి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన భూక్యా సంజీవ నాయక్ నియమితులయ్యారు. బుధవారం సాయంత్రం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు జాగృతి కండువా కప్పి జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. జాగృతి బలోపేతానికి కృషి చేస్తానని సంజీవ్ తెలిపారు. కాగా ఈ నియామకం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.