E.G: దీపం-2 పథకంలో భాగంగా రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువు నేటితో ముగియనుంది. ఉమ్మడి జిల్లాలో 12.19 లక్షల మంది లబ్దిదారులు బుకింగ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా సుమారు 1.80వేల మంది లబ్దిదారులు బుకింగ్ చేసుకోవాలన్నారు. బుకింగ్ చేసుకోని లబ్ధిదారులు వెంటనే బుక్ చేసుకోవాలని, లేదంటే రెండో సిలిండర్ పొందే అవకాశం కోల్పోతారని పేర్కొన్నారు.