NLR: బైకులను చోరీ చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న వంశీని వేదాయపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు.అతని వద్ద నుంచి రూ.2.50 లక్షలు విలువ చేసే 2 బైకులను సీజ్ చేశారు. బుధవారం అతనిపై వేదాయపాలెంతో పాటు వేరే ప్రాంతాల్లో కేసులు ఉన్నట్లు సీఐ శ్రీనివాస్ రావ్ తెలిపారు. కనుపర్తిపాడు సమీపంలో నిందితున్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశామని తెలిపారు.