AP: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పొదలకూరు ఎక్సైజ్ కేసులో బెయిల్ మంజూరైంది. అక్రమ మద్యం నిల్వ కేసులో ఆయనను A-8 నిందితుడిగా చేర్చారు. ప్రధాన నిందితుడి కాల్ డేటా ఆధారంగా కాకాణికి సంబంధం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించారు. అయితే ఈ కేసులో గూడూరు అదనపు మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. కాగా అక్రమ మైనింగ్ కేేసులో ఆయన జైల్లో ఉన్నారు.