కృష్ణా: ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో దావణగిరి నగరంలో జరిగిన జాతీయ సీనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం పవర్ లిఫ్టర్ చంద్రకళ 76 కేజీల శరీర బరువు విభాగంలో మొత్తం 525 కేజీల బరువు ఎత్తి అఖిలభారత స్థాయిలో బంగారు పతకం సాధించింది. ఈ క్రమంలో జిమ్ కోచ్ వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు క్రీడాకారిణి చంద్రకళను బుధవారం అభినందించారు.