VZM : చెక్కు బౌన్స్ కేసులో మెంటాడ మండలం బడేవలస గ్రామానికి చెందిన మీసాల బంగారునాయుడుకు ఏడాది జైలు శిక్షతో పాటు ఆరు లక్షల 70 వేల రూపాయలు జరిమానా విధిస్తూ గజపతినగరం కోర్టు న్యాయమూర్తి విజయ్ రాజ్ కుమార్ బుధవారం తీర్పు చెప్పారు. గజపతినగరం మండలం పురిటీపెంట గ్రామానికి చెందిన కాపారుపు శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం తీర్పు వెలువరించారు.