GNT: గుంటూరును హరిత నగరంగా మార్చే లక్ష్యంతో మిషన్ గ్రీన్ ద్వారా 5 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్తో కలిసి పర్యటించిన వారు నగర ప్రవేశ మార్గాలు, ప్రధాన రోడ్లకు ఇరువైపులా, డివైడర్లపై మొక్కలు నాటాల్సిన ప్రాంతాలను పరిశీలించారు.