NLR: బోగోలు మండలంలోని కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం గురు పౌర్ణమి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. స్వామివారికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయని నిర్వహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు పున్నమి గరుడసేవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలియజేశారు.