GNTR: వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం హుండీల లెక్కింపు జరిగింది. గుంటూరు ఆలయ సహాయ కమిషనర్ సుభద్ర పర్యవేక్షణలో 113 రోజులకు గాను భక్తుల నుంచి కానుకల రూపంలో స్వామివారికి రూ.46,76,204 ఆదాయం లభించినట్లు కార్యనిర్వహణాధికారి అనుపమ తెలిపారు. అలాగే 19.5 గ్రాముల బంగారం, 319 గ్రాముల వెండి కూడా వచ్చినట్లు ఆమె వివరించారు.