GNTR: చేబ్రోలు నుంచి పొన్నూరు వైపు ప్రవహించే మంచాల కాలువకు మహర్దశ పట్టింది. బుధవారం పూడికతీత పనులను నీటిపారుదల శాఖ అధికారులు చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా పూడికతో సాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్న రైతన్నలకు కూటమి ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు ముందే పనులు చేపట్టడం ఊరటనిచ్చింది.