ప్రకాశం: వెలగపూడి సచివాలయంలో బుధవారం కొండేపి ఎమ్మెల్యే, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి ప్రజల వద్ద నుండి సేకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి స్వామి హామీ ఇచ్చారు.