SKLM: హిరమండలం మండలం కూర్మ వైదిక గ్రామంలో వర్ణాశ్రమ కళాశాలలో చేతివృత్తులపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు ప్రభుదాస్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. పూర్వ వృత్తుల పునరుద్ధరణ, సత్ప్రవర్తన, ఇంద్రియ నిగ్రహణ, ఆధ్యాత్మిక భావాలు పెంపొందించడం వంటి అనేక అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 15 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు శిక్షణ పొందవచ్చు.