కృష్ణా: జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఈ నెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుత కలెక్టర్ డీకే బాలాజీ LTC సెలవులపై వెళ్లనున్నందున ఈ బాధ్యతలు గీతాంజలి శర్మకు అప్పగించారు. నాలుగేళ్లకోసారి ప్రభుత్వం IAS అధికారులకు కుటుంబంతో ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ ఖర్చులు భరిస్తుంది.