శ్రీకాకుళం జిల్లాలో పలు మండలాల్లో నేడు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని APSDMA ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ‘X’ ఖాతా ద్వారా శనివారం తెలిపింది. బూర్జ, జి. సిగడాం, హిరమండలం, ఇచ్ఛాపురం, జలుమూరు, కంచిలి, మెళియాపుట్టి, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాల్లో 40°C- 42°C అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.