ప్రతి విషయంలో పాకిస్తాన్ అసత్య ప్రచారం చేస్తోందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఆఫ్గనిస్తాన్ లక్ష్యంగా భారత్ ఎలాంటి దాడులు చేయలేదని స్పష్టం చేశారు. గతేడాదిన్నర నుంచి తమపై దాడులు ఎవరు చేస్తున్నారనేది ఆఫ్గాన్కు ప్రత్యేకంగా గుర్తు చేయనవసరం లేదని వ్యాఖ్యానించారు.