AP: పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని తెలిపారు. ‘వండర్ లా, ఇమేజికా సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. తిరుపతిలో వినోద కేంద్రం ఏర్పాటుకు ఆసక్తి చూపారు. డిస్నీ ల్యాండ్ చాలా పెద్ద ప్రాజెక్టు. డిస్నీ ల్యాండ్ ప్రస్తుతం మెట్రో నగరాల్లో మాత్రమే ఉంది’ అని వివరించారు.