KRNL: పెద్దకడబూరులోని మండల వ్యవసాయ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. కార్యాలయం పైకప్పు పెచ్చులూడుతోంది. ఏవో, వ్యవసాయ సిబ్బంది భయంతో విధులు కొనసాగిస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వ్యవసాయ కార్యాలయానికి మరమ్మతులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.