NTR: హీరోయిన్ సమంత శనివారం విజయవాడ రానున్నారు. సమంత ప్రొడ్యూసర్ తీసిన “శుభం” సినిమా విజయవంతమైన నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు ఆమె చిత్రబృందంతో కలిసి నగరంలోని క్యాపిటల్ సినిమాస్‌కు రానున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. సమంత ప్రొడ్యూసర్‌గా వ్యహరించిన ఈ సినిమాకు ప్రవీణ్ దర్శకత్వం వహించారు. 7 గంటలకు సమంత గుంటూరు మైత్రి సినిమాస్‌కు వెళ్తారని మూవీ టీమ్ తెలిపింది.