MDCL: మల్కాజ్గిరి పరిధిలోని నేరేడ్మెట్ వాయుపురిలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హెల్మెట్ ధరించని రైడర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి, ‘హెల్మెట్ బ్యాంక్’ ద్వారా తాత్కాలిక హెల్మెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.