KRNL: పెళ్లిళ్లకు డీజేలకు అనుమతి లేదని కోడుమూరు ఎస్సై ఎర్రిస్వామి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పెళ్లిళ్లకు అర్ధరాత్రి దాటే వరకు డీజేలను వినియోగిస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీనికి తోడు పెద్దశబ్దంతో డీజేలను వినియోగిస్తూ శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారని, ఇతరులను ఇబ్బందులకు గురిచేయడం తగదని అన్నారు.