NRML: సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని మండల పోలీసులు సూచించారు. మంగళవారం స్థానిక బస్టాండ్ సమీపంలో మహిళలకు సైబర్ నేరాలు,చైన్ స్నాచింగ్ తదితర విషయాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పవద్దని, అనవసర లింకులు ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.