MBNR: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి చెందిన నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీరుగా చక్రధరం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆధికారులు, సిబ్బంది ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం స్వీట్లు తినిపిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు. ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చక్రధరం తెలిపారు.