NLR: పొదలకూరు యాడ్లో నిమ్మకాయల ధరలు కేజీలు రూ.15, బస్తా రూ. 1000 నుంచి రూ.1500 వరకు పలికిందని వ్యాపారాలు తెలిపారు. కాగా గత నెలలో కేజీ రూ.60 నుంచి రూ. 70 వరకు, బస్తా రూ. 4000 నుంచి రూ. 5000 వరకు పలికిందని ఇప్పుడు ధరలు పూర్తిగా తగ్గిపోయాయని ఆవేదన చెందారు. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.