ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక వైద్యుడు బీవీ పట్టాభిరామ్ ఆకస్మిక మృతి తనను బాధించిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వ్యక్తిత్వ వికాస బోధనలు, రచనలతో ఎంతోమందిని ప్రభావితం చేశారని.. ఆయన మృతి తీరని లోటన్నారు. పట్టాభిరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.