SKLM: టెక్కలిలో నిర్మాణం జరుగుతున్న మూలపేట పోర్టు రోడ్డును మంగళవారం సాయంత్రం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పోర్టు రోడ్డు నిర్మాణం జరుగుతున్న బన్నువాడ, పిఠాపురం, అయోద్యపురం తదితర గ్రామాల వద్ద రైతులతో మాట్లాడారు. పోర్టు రోడ్డు నిర్మాణ ప్రాంతాల్లో సాగునీటి కాలువలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు.