ELR: ఏలూరు నగరంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పరిశీలించారు. జిల్లాలో ఉన్న 2,58,098 మంది పింఛన్దారులకు ప్రభుత్వం రూ.112.72 కోట్లు విడుదల చేసిందన్నారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి 2,34,760 మంది పింఛన్దారులకు రూ.102.16 కోట్లు(91శాతం) పంపిణీ చేయడం జరిగిందన్నారు.