WNP: జిల్లాలో నిర్వహించే టోపోనమి సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. సర్వే ఆఫ్ ఇండియా నోడల్ అధికారి సురేష్ కుమార్ సర్వేపై మంగళవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..ఈ సర్వే ద్వారా జిల్లాకు సంబంధించిన నైసర్గిక స్వరూపం కచ్చితత్వంతో నమోదు జరిగే విధంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.