SRPT: తిరుమలగిరి మండలం మాలిపురంలో ఈనెల 14న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో సభా స్థలాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి మంగళవారం పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్న సందర్భంగా సభ స్థలాలను పరిశీలించామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు.