NDL: వెలుగోడు మండలం మోత్కూరు, మాధవరం గ్రామాలలో ఏవో స్వాతి ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా వరిలో సూడోమోనాస్ అనే బయో శిలీంద్ర నాశిని వాడకం గురించి రైతులకు డీఆర్సీ నంద్యాల ఏడీఏ సరళమ్మ వివరించారు. వరి చిరు పొట్ట దశలో ఉన్నప్పుడు సుడోమోనాస్ స్ప్రే చేసుకోవడం వలన మెడ విరుపు తెగులు, మచ్చ తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చనన్నారు.