కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే RSSను బ్యాన్ చేస్తామని ప్రకటించారు. ఆ సంస్థ విద్వేషాలను రెచ్చగొడుతోందని.. రాజ్యాంగానికి లోబడి పనిచేయడం లేదని ఆరోపించారు. అలాగే, వారి వద్దకు వచ్చిన రూ.250 కోట్ల ఫండ్స్ ఎక్కడివని.. వీటిపై కచ్చితంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.