జబర్దస్త్ షో(Jabardasth Show) ద్వారా చాలా మంది నటీనటులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో చలాకీ చంటీ(Chalaaki Chanti) ఒకడు. జబర్దస్త్ షోలో టీమ్ లీడర్‌గా చేస్తూ మరోవైపు సినిమాల్లోనూ బిజీ అయిపోయాడు. కమెడియన్(Comedian)గా తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. చలాకీ చంటీ తన పంచ్‌లతో కామెడీని పండిస్తూ టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే గత కొన్ని రోజులుగా చలాకీ చంటి అటు టీవీ షో(TV Shows)లల్లోనూ, ఇటు సినిమా(Movies)ల్లోనూ కనిపించడం లేదు.
చలాకీ చంటీ(Chalaaki Chanti) తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నట్లు సమాచారం. పలు అనారోగ్య సమస్యల(Health Problems) వల్ల చలాకీ చంటి ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతకు గురైన చలాకీ చంటీ ప్రస్తుతం ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. జబర్దస్త్ షో(Jabardasth Show)లో గుర్తింపు తెచ్చుకన్న చంటి బిగ్ బాస్(Big boss) రియాల్టీ షోలో కూడా మెరిశాడు.
బిగ్ బాస్ సీజన్ 6(BigBoss 6)లో చంటీ కంటెస్టెంట్ గా వచ్చి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. చంటీ(Chalaaki Chanti) ఆస్పత్రిలో చేరారనే వార్త తెలియడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే చలాకీ చంటీకి అనారోగ్య సమస్య(Health Problems) ఏంటనే వివరాలు తెలియాల్సి ఉంది. చలాకీ చంటీ త్వరగా కోలుకుని ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.