సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ కమెడియన్ అల్లు రమేష్ మృతి చెందిన సంగతి తెలిసిందే. నిన్న మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి(mammootty) తల్లి తుదిశ్వాస విడిచింది. తాజాగా ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర(Anil Sunkara) ఇంట్లో విషాదం నెలకొంది. దీంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అయిన అనిల్ సుంకర ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. అనిల్ సుంకర పెద్దనాన్న సుంకర బసవరావు(Sunkara Basavarao) శనివారం ఉదయం మరణించారు.
తన పెద్ద నాన్న సుంకర బసవరావు(Sunkara Basavarao) మరణించిన విషయాన్ని అనిల్ సుంకర(Anil Sunkara) ట్విట్టర్(Twitter) ద్వారా తెలిపారు. అనిల్ సుంకర విజయానికి ఆయన పెద్దనాన్న బాటలు వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అనిల్ సుంకర్ ఎమోషనల్ ట్వీట్(Emotional tweet) చేశారు. తనను ఎంతగానో ప్రేమించి, అన్ని రకాలుగా తన పెద్దనాన్న ప్రోత్సహించారని అనిల్ సుంకర తెలిపారు.
సుంకర బసవరావు(Sunkara Basavarao) ఆత్మకు శాంతి కలగాలని అనిల్ సుంకర(Anil Sunkara) ప్రార్థించారు. సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో ఇప్పటి వరకూ నిర్మాత అనిల్ సుంకర బిందాస్, దూకుడు, ఆగడు, లెజెండ్, రాజుగారి గది, కృష్ణగాడి వీర ప్రేమగాధ వంటి చిత్రాల(Movies)ను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన రూపొందించిన ఏజెంట్ సినిమా(Agent movie) విడుదలకు సిద్ధంగా ఉంది. చిరంజీవితో భోళా శంకర్ సినిమా(Bholaa Shankar Movie)ను నిర్మిస్తున్నారు.