SKLM: కొత్తూరు మండలం ఆకుల తంపర ఇసుక రీచ్‌ను శుక్రవారం కొత్తూరు ఎమ్మార్వో కే బాలకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. వంశధార నది నుంచి పరిమితికి మించి ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఇసుక రీచ్ వద్ద సిబ్బందితో మాట్లాడి పలు వివరాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో గిరీష్ పట్నాయక్, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.