ప్రకాశం: సీపీడీసీఎల్ డిస్కం సీఎండీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పి.పుల్లారెడ్డిని ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 1104 యూనియన్ నాయకులు హరికృష్ణ, సంజీవరావు శుక్రవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. కార్మికుల సమస్యల పై దృష్టి సారించి న్యాయం చేయాలని కోరగా సీఎండీ సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు.