HYD: నిషేధిత విదేశీ సిగరెట్లు అనుమతి లేకుండా విక్రయిస్తున్న వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టోలిచౌకి మొరాజ్ కాలనీకి చెందిన తాహిర్ అలీ అనే వ్యక్తి తన పాన్ షాప్‌లో విదేశీ సిగరెట్లు విక్రయిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి సిగరెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం అతనిని రిమాండ్‌కి తరలించారు.