GNTR: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడైన సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్‌కు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ను అణచివేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో ప్రధాని మోదీకి యావత్ భారతావని అండగా ఉంటుందని అన్నారు.